శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (18:35 IST)

ఈ 5 చిట్కాలు పాటిస్తే...?

కాలీఫ్లవర్‌ను గోబీ అని కూడా అంటారు. ఈ ఆకులను సలాడ్ రూపంలో తీసుకుంటారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ గోబీ ఆకులు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
1. దంత సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ పచ్చి ఆకులను తీసుకుంటే సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వెంట్రుకలు ఎక్కువగా రాలేవారు ప్రతిరోజూ 50 గ్రాములు గోబీ ఆకులు ఎండబెట్టి పొడిచేసి తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. 
 
2. గోబీ పచ్చి ఆకుల రసాన్ని గాయాలపై పూతలా వేసుకుని కట్టు కడితే గాయాలు మానిపోయి మంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 
 
3. ఉదయం పరగడుపున అరకప్పు గోబీ రసాన్ని తీసుకుంటే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. నిద్రలేమి, మూత్రాశయంలో రాళ్లు వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. గోబీ రసం తీసుకోవాలి. దీనిలో కొద్దిగా నెయ్యి కలిపి ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు పేర్కొన్నారు. 
 
4. గ్లాసు మజ్జిగలో పాలాకు రసం, ఒకగ్లాస్ గోబీ ఆకు రసాన్ని కలిపి రెండు పూటలా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవరని చెపుతున్నారు. 
 
5. భోజనంతోబాటు పెరుగు, ఒక కప్పు క్యారెట్ రసం, పాలాకూర రసం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.