బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2023 (22:45 IST)

ఆల్‌బుఖరా పండ్లు తింటే అద్భుత ప్రయోజనాలు, ఏంటో తెలుసా?

Alubukhara fruit
ఆల్‌బుఖరా పండ్లు. ఈ పండ్లు తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా వుండాలంటే ఈ పండ్లను తినాలి. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఉంటే ఆల్‌బుఖరా లేదా రేగు పండ్లను తినాలి. ఆల్‌బుఖరా పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలం, రోజువారీ ఆహారంలో రోజువారీ సిఫార్సు చేసిన ఫైబర్‌లో 4% వీటి ద్వారా లభిస్తుంది.
 
ఆల్‌బుఖరా పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకమైనది. ఆల్‌బుఖరా పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇందులో వున్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆల్‌బుఖరా పండ్లలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడటమే కాకుండా ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
 
ఆల్‌బుఖరా పండ్లు రోగనిరోధక కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఆల్‌బుఖరా పండ్లు తింటుంటే సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.