Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోగం రానివ్వని ఆహార పదార్థాలు... ఏంటవి?

శుక్రవారం, 10 నవంబరు 2017 (15:38 IST)

Widgets Magazine
food

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన రోగ నిరోధక వ్యవస్థ. దానిని జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోనివారు, పొగత్రాగే అలవాటు, మత్తుపానీయాల అలవాటు, విటమిన్ లోపం వంటి వాటివల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. 
 
ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సమపాళ్ళలో పోషక పదార్థాలను శరీరానికి అందించాలి. అందులో ఒక్కొక్క పదార్థానికి ఒక విశిష్ట గుణముంది. మామిడి, బత్తాయి వంటి  పండ్లు ద్వారా ఎ విటమిన్, నిమ్మ, ఉసిరి వంటి వాటిద్వారా విటమిన్ సి, కోడిగుడ్ల ద్వారా జింక్, ఐరన్, బాదం, కిస్‌మిస్ వంటి వాటి ద్వారా మేలు చేసే కొవ్వులు, చేపల ద్వారా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందగలవు.
 
ప్రతీరోజు ఆహారంలో ఆకుకూరలు, పెరుగు తీసుకోవాలి. వెల్లుల్లికి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే శక్తి ఉంది. మాంసం తింటే బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులు అరికడుతుంది. ఆల్చిప్పల వంటి వాటిద్వారా ప్లూ వ్యాధిని నిరోధించే సెలేనియమ్‌ని  పొందవచ్చు. కాబట్టి జంక్ ఫుడ్ వంటివి తీసుకుని అనారోగ్యం తెచ్చుకోకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు ఏవో తెలుసుకుని తీసుకుంటుండాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గోంగూర పువ్వులతో ఇన్ఫెక్షన్లకు చెక్

శరీరంలో నీటి శాతం తగ్గడం.. మలినాలు శరీరంలోనే నిలిచిపోవడం.. ద్వారా ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో ...

news

ఆరెంజ్‌తో కొలెస్ట్రాల్ పరార్..

ఆరెంజ్‌లో కొవ్వు శాతం చాలా తక్కువగా వుంటుంది. పీచు వుంటుంది. తద్వారా శరీర బరువును ...

news

జాజికాయతో పెరిగే లైంగిక సామర్థ్యం (video)

జాజి ఆకుల రసానికి సమంగా నువ్వుల నూనెను కలిపి సన్నని సెగపై ఇగిరే దాకా కాచి.. తైలంలా ...

news

నిద్ర సరిగ్గా పోకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. ...