సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్

రాత్రిపూట చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే...

శారీరకంగా బలహీనంగా ఉన్నవారు తాము తీసుకునే భోజనంతోపాటు రెండు లేదా మూడు చెంచాల తేనెను సేవించండి. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.  
 
అలసట: శారీరకంగా అలసట చెందినప్పుడు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరంలో నూతనోత్తేజం ఉప్పొంగి వస్తుంది. 
 
అజీర్తి: ఆహారం జీర్ణం కానప్పుడు పాలాకును ఆహారంగా తీసుకోండి లేదా టమోటా రసం త్రాగండి. 
 
అరికాళ్ళల్లో మంటగా ఉంటే : అరికాళ్ళల్లో మంటగా ఉంటే సొరకాయను ముక్కలుగా కోసుకుని కాళ్ళపై ఉంచుకోండి. దీంతో అరికాళ్ళల్లో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.