పనస పండ్లను ప్రతిరోజూ తింటే...(video)

మంగళవారం, 17 జులై 2018 (09:24 IST)

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో చాలా మంది పనస పండును తినేందుకు ఆసక్తిని చూపిస్తారు.
jackfruit
 
సాధారణంగా ఈ పండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్ల కన్నా భిన్నమైన ప్రయోజనాలను ఈ పండు అందిస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి శక్తినిస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయితే అసలు పనస పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 
 
* పనస పండ్లలో విటమిన్ ఎ, సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. 
* పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. 
* పనస పండులో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. వాపులను తగ్గిస్తుంది. 
* పనస పండ్లలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. 
* టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి. 
* గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హై బీపీ, హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 
* పనస పండును తరచూ తీసుకుంటుంటే అలాంటి ముడతలు ఏర్పడవు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. 
* రుచి తియ్యగా ఉన్నప్పటికీ పనస పండ్లు షుగర్ లెవల్స్‌ను పెంచవు. 
* ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అమాంతం పెరగకుండా చూస్తాయి. 
* డయాబెటిస్ ఉన్న వారు కూడా పనస పండ్లను నిర్భయంగా తినవచ్చు. 
 
 



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పురుషులు నల్లతుమ్మ చూర్ణాన్ని తీసుకుంటే?

ఎండిన నల్ల తుమ్మకాయలు, బెరడు, బంక ఈ మూడింటిని సమంగా కలిపి చూర్ణం చేసుకుని స్పూన్ మోతాదులో ...

news

గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఉప్పు నీటిని తీసుకుంటే?

వర్షాకాలంలో వచ్చే సమస్యలలో గొంతునొప్పి ఒకటి. ఇది వైరల్‌ లేదా బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ...

news

కొబ్బరి పాలు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?

రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ...

news

నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా? (Video)

"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ ...