శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (15:57 IST)

మిరియాల పొడిలో ఉప్పు కలిపి తీసుకుంటే..?

ఈ చలికాలం కారణంగా ఎక్కడ చూసినా జలుబు, దగ్గు వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి. ఈ రెండూ వయసు తేడా లేకుండా ఎవరు పడితే వారికి వచ్చేస్తుంటాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. మిరియాలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. మరి మిరియాలు తీసుకుంటేనైనా జలుబు, దగ్గు తగ్గుతుందా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం...
 
1. గొంతునొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతోపాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడిచేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధతగ్గిపోతుంది. మిరియాల సాంబారు పడిశాన్ని అదుపులో ఉంచుతుంది.
 
2. మిరియాలని, ఉల్లిపాయన్ని కలిపి నూరుకుని తింటే జలుబు, దగ్గు వేధించవు. నేతితో మిరియాలని వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల పొడి చారుకి మించిన గొప్ప వైద్యం లేదు.
 
3. మిరియాలు, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా ఉడికించుకుని ఆ నీటిలో తేనె కలుపుకుని, అప్పుడప్పుడూ తాగుతుంటే శరీర వేడి తగ్గుతుంది.
 
4. అజీర్ణవ్యాధితో బాధపడేవారికి కూడా మిరియాలు ఎంతో మేలుచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు గలవారికి మిరియాలు గొప్ప ఔషధం.
 
5. తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వలన రుచితో పాటు ఆరోగ్యమూ కల్గుతుంది. మతిభ్రమ, మూర్భ, హిస్టీరియా లాంటి వ్యాధులు ఉన్నవారు మిరియాల ఘాటును పీల్చితే ఎంతో మంచిది.
 
6. మిరియాల పొడి, ఉప్పు పొడి సమంగా కలిపి, ఆ పొడిని కొండనాలుకకు బాగా అద్దుకుంటే కొండనాలుగ తగ్గి, విపరీతంగా వచ్చే దగ్గు నివారణమవుతుంది.