ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి... ఆ తర్వాత తాగితే...

గురువారం, 31 మే 2018 (17:54 IST)

మనం నిత్యం ఆహారంగా వాడే దుంపకూరల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి శరీర పోషణకే గాక ఆరోగ్యరక్షణలో కూడా ఉపయోగపడే దుంపకూరల్లో ముల్లంగికి ప్రత్యేక స్థానము ఉంది. దీనిని కూరగాను, సాంబారులోను వాడతారు. పచ్చడి చేసుకుంటారు. ముల్లంగిలోని ఔషధ గుణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి.
 
2. నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండుమూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
 
3. నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని చూర్ణంలా చేసుకుని రోజు రెండుసార్లు సేవించడం వల్ల మూత్రపిండ, మూత్రాశయలలో రాళ్ళు కరిగిపోతాయి.
 
4. ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ఉంచితే మంట, నొప్పి, పోటు త్వరగా తగ్గుతాయి.
 
5. ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే పురుషులలో ఏర్పడే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది.
 
6. ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా భాగాలపై పట్టిస్తుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.
 
7. 10-20 మి.లీ ముల్లంగి ఆకుల రసంలో తగినంత పంచదార కలిపి రెండుసార్లు సేవిస్తుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.దీనిపై మరింత చదవండి :  
Radish Nuts Health Benefits

Loading comments ...

ఆరోగ్యం

news

మునగాకును రసాన్ని తీసుకుంటే ఆ జబ్బులన్నీ నయమవుతాయ్...

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహరమే. అయితే మునక్కాయలను వాడినంతంగా మునగాకు మనలో చాలా మంది ...

news

జనపనార విత్తనాలు తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టేయచ్చు...

జనపనార విత్తనాలు అద్భుతమైన పోషక విలువలను కలిగిఉంటాయి. ఇది మన శరీరానికి కావలసిన సుమారు ...

news

అవి తింటే బెడ్రూంలో పురుషుల శృంగార శక్తి అపారం...

ఇటీవల కాలంలో తీసుకుంటున్న ఆహారంలో లోపం వలన కానీ, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వల్ల గానీ ...

news

విటమిన్ 'ఇ' వున్న ఆహారపదార్థాలు తీసుకుంటే?

బ్రిటీష్ నిపుణులు నిర్వహించిన పరిశోధనలో కాలుష్యం వలన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ...

Widgets Magazine