గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2024 (23:44 IST)

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

Ginger
అల్లం. ఈ అల్లాన్ని ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఉప‌యోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము.
 
అల్లం పాలుతో జ‌లుబు, ఫ్లూ, అజీర్ణం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
అల్లం పాలు తాగితే రోగ నిరోధ‌కశ‌క్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.
అల్లంలో ఉండే థ‌ర్మోజెనిక్ గుణాలు మ‌న‌ల్ని వెచ్చ‌గా ఉంచుతాయి
అల్లం, పాలు రెండింటినీ క‌లిపి తాగ‌డం వ‌ల్ల ల‌భించే పోష‌కాలు ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉంచుతాయి.
గొంతులో కఫం వంటి సమస్యలను ఇవి దూరం చేస్తాయి.