బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. హోమియోపతి
Written By chitra
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (09:49 IST)

నెలసరి నొప్పి తగ్గేదెలా?

ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలలో బహిష్టు సమయంలో పొత్తి కడుపునొప్పి బాధిస్తుంది. స్త్రీలలో నెలసరి సమయంలో నొప్పి రావడాన్ని డిస్మెనోరియా  అంటారు. సుమారు 50 శాతం మంది స్త్రీలలో 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వరకు ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమేణా వయస్సు పెరుగుతున్న కొద్దీ, కొంత మంది స్త్రీలలో వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది.
 
అమ్మాయిల్లో రుతుక్రమం సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల మద్య వయస్సులో ఆరంభమవుతుంది. ప్రారంభమైన కొంతకాలం వరకు నెలసరి అంత క్రమబద్ధంగా రాకపోవచ్చు. చాలా మందిలో 18ఏళ్ళ వయస్సు చేరుకునేసరికి చాలావరకు క్రమబద్ధత సంతరించుకుంటాయి. అలాగే 45 నుంచి 50 ఏళ్ల వయస్సులో చాలా మంది స్ర్తీలలో మోనోపాజ్‌ వస్తుంది. ఈ దశకు ముందు కూడా నెలసరిలో హెచ్చుతుగ్గులను గమనించవచ్చు.
 
రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. రుతుస్రావం 3రోజుల నుంచి 7 రోజులపాటు కన్పిస్తుంది. రుతుక్రమాన్ని మరియు రుతుస్రావాలను మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరీ గ్రంధి అండాశయంలో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజన్,  ప్రొజెస్టిరాన్ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్సత్తి అయ్యే ప్రొస్టాగ్లాండినస్ అన్ని కలిసి ప్రభావితం చేస్తుంటాయి.
 
హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి ప్రయత్నించాలి. నిత్యం, యోగా ప్రాణాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని నివారించటానికి ధ్యానం చేయాలి. నొప్పి తీవ్రత, రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.
 
డిస్మనోరియాకు హోమియోలో బెల్లడోనా, కామెమిల్లా, మెగ్‌ఫాస్‌, అబ్రోమా లాంటి చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి. పైన పేర్కొన్న మందులను హోమియో వైద్యుడు సూచన మేరకు నిర్ణీత కాలంమేద వాడటం వల్ల సమస్యకు సురక్షితమైన శాశ్వతమైన ఎలాంటి ఆపరేషన్ లేకుండా పరిష్కారం లభిస్తుంది.