శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (12:30 IST)

ఎయిర్ కూలర్‌ను వినియోగించినప్పుడు తలుపులు, కిటికీలను?

ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ఐతే ఈ చిట్కాలు పాటించండి. ఎయిర్ కూలర్‌లో నీళ్లు తగ్గిపోతే వెంటనే వాటర్ మోటర్‌ను ఆఫ్ చేయాలి. లేనట్లైతే మోటార్ పాడైపోతుందట. అలాగే కూలర్ ఆన్‌లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత

ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ఐతే ఈ చిట్కాలు పాటించండి. ఎయిర్ కూలర్‌లో నీళ్లు తగ్గిపోతే వెంటనే వాటర్ మోటర్‌ను ఆఫ్ చేయాలి. లేనట్లైతే మోటార్ పాడైపోతుందట. అలాగే కూలర్ ఆన్‌లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల నీరు ఫ్యాన్ మోటార్, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలపై చిమ్మి.. పాడైపోయే అవకాశం ఉంటుంది. 
 
ఎయిర్ కూలర్లను రెగ్యులర్‌గా వాడుతున్నప్పుడు కనీసం ఐదారు రోజులకోసారి ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా తీసేసి, డిటర్జెంట్‌తో కడిగి శుభ్రం చేసుకోవాలి. తద్వారా నీటిలో ప్రమాదకర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపుతుండడం వల్ల కూలర్ల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అవసరమైతే కూలర్ సెంట్లు వినియోగించుకోవచ్చు. కూలర్లలో కూలింగ్ ప్యాడ్‌లు పూర్తిగా తడుస్తున్నాయా, లేదా చూసుకోవాలి. కూలింగ్ ప్యాడ్లు పూర్తిగా తడవకపోయినా, వాటి మధ్య ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్నా గాలి చల్లగా రాదు. 
 
ఎయిర్ కూలర్‌ను వినియోగించినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంటే ఇంట్లో తేమ శాతం పెరిగిపోతుంది. దాంతో చల్లదనం కాదుకదా.. తీవ్రంగా ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. దీనికి పరిష్కారం మంచి వెంటిలేషన్ ఉండటమేనని వైద్యులు చెప్తున్నారు. ఇంట్లోని గాలి బయటికి, బయటిగాలి ఇంట్లోకి వచ్చేలా వెంటిలేషన్ ఉంటే.. ఎయిర్ కూలర్లు సమర్థవంతంగా పనిచేస్తాయి.