గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (10:47 IST)

గోడలకు అందం చేకూర్చే ఫోటో ఫ్రేములు

సాధారణంగా ఇల్లు చిన్నగా ఉంటే సమస్య ఉండదు కానీ, ఇల్లు పెద్దతైనే సమస్య. ఎందుకంటే పెద్ద ఇంట్లో గోడలు విశాలంగా ఉంటాయి, విశాలంగా ఉన్న గోడలు ఖాళీగా ఉంటే బోసిపోయినట్లు కనిపిస్తుంటాయి. అయితే ఆ గోడలికి ఎలా అందం చేకూర్చాలో చాలా మందికి తెలీదు. ఇళ్లల్లో గోడలు ఖాళీగా కనిపిస్తే చాలు... చాలా మంది పాత క్యాలెండర్లు, పాతకాలపు ఫోటోలు తగిలించేస్తుంటారు. దీనివల్ల మీరు గోడలకు ఎంత మంచి పెయింట్ వేసినా అందవిహీనంగానే కనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది అదేంటంటే ఫోటో ఫ్రేములను గోడలకి తగిలిస్తే సరి. ఇవి గోడలను అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. మరి వీటి అలంకరించడంలోనూ కొన్నిచిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం..
 
మీరు ఫోటో ఫ్రేముల్ని అమర్చే గోడపైన సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్రేములపై ఎండ నేరుగా పడడం వల్ల ఫ్రేమ్‌లు పగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ఫోటో ఫ్రేముల్ని అమర్చే గోడకు ఎదురుగా ఉండే గోడకు కిటికీలు లేకుండా జాగ్రత్తపడడం మంచిది. 
 
చాలావరకు కొంతమంది ఫోటో ఫ్రేములన్నీ గోడకు అడ్డంగా లేదంటే పొడవుగా అమర్చుతుంటారు. దీని వల్ల అంత అందంగా కనిపించకపోవచ్చు. కాబట్టి ఫోటో ఫ్రేములన్నీ రెండు మూడు వరుసలు లేదంటే సర్కిల్, డైమండ్, చతురస్రం, ఇలా పలు రకాల షేపుల్లో గోడలపై అమర్చుకోవచ్చు. ఇలాచేయడం వల్ల గోడలు మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
 
గోడలకి అమర్చే ఫోటో ఫ్రేముల రంగులు మీ ఇంట్లోని గోడల రంగులకు సరిపోతుందో లేదో కూడా గమనించాలి. ఎందుకంటే గోడలకు వేసే అన్ని రంగుల పెయింట్లు ఫోటో ఫ్రేముల రంగులకు సరిపడకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే గోడ, ఫోటో ఫ్రేముల అందం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
 
మీరు తగిలించిన ఫోటో ఫ్రేములు పైపైన కాకుండా సరిగ్గా తగిలించడం మంచిది. లేదంటే కింద పడిపోయి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. బొమ్మల ఫ్రేముల్ని, ఫోటో ఫ్రేముల్ని ఒకే గోడపై అమర్చుకూడదు. ఎందుకంటే ఇలా అమర్చడం వల్ల రెండింటి మధ్య వ్యత్యాసం తెలియకపోవచ్చు. అలాగే అందంగా కూడా కనబడకపోవచ్చు. కాబట్టి, వీటిని వేర్వేరు గోడలపై అమర్చడం మంచిది.