శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2014 (17:23 IST)

ఇండోర్ గార్డెన్ కోసం చిట్కాలు..

ఇండోర్ గార్డెన్ కోసం.. ఆయా గదుల్లో ఏయే మొక్కల్ని ఎక్కడ అమర్చాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇండోర్ గార్డెన్ కోసం మీరు ఎంచుకొనే మొక్కలు ఇంటికి సరికొత్త శోభను తీసుకొచ్చేలా, కలర్ ఫుల్ గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని మొక్కలు సూర్యకాంతిలో పెరుగుతాయి. అలాంటి వాటిని ఇంట్లో సూర్యకాంతి పడే చోటా అమర్చాలి. 
 
ఇంట్లో అసలు సూర్యకాంతి పడకపోతే మొక్కల పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి వాటికి ప్రత్యేకంగా లైటింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే బాగా చల్లగా బాగా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఉంచకూడదు. కొన్ని మొక్కలు డిమ్ లైట్‌లో బాగా పెరుగుతాయి. అలాంటి మొక్కల్ని పెద్ద కిటికీల దగ్గర తూర్పు లేదా పడమరకు అభిముఖంగా అమర్చవచ్చు. ఒక వేళ కిటికీలో నుంచి ఎక్కువ వెలుతురు పడుతున్నట్లైతే నెట్ కర్టెన్ వేస్తే సరిపోతుంది.