శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (17:55 IST)

టమోటా మంచి క్లీనింగ్ ఏజెంట్.. మిక్సీలో వేసి..

టమోటాలను మనం కేవలం ఆహార పదార్థంగా లేదా సౌందర్య సాధనంగా మాత్రమే ఉపయోగిస్తుంటాం. అయితే టమోటా మంచి క్లీనింగ్ ఏజెంట్ కూడా టమోటాలకు పై పొరను తీసేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేయండి.

దానికి కొంచెం మెత్తటి ఉప్పును చేర్చి, స్టవ్ మీద, ఫ్లాట్ ఫామ్ మీద పడ్డ మొండి మరకల మీద రాసి, కాసేపటికి పొడిబట్టతో తుడిచేస్తే.. మరకలు తొలగిపోతాయి. 
 
అంతేనా.. స్టీలు గిన్నెలు తెల్లగా మారాలన్నా, ఇత్తడి, రాగి పాత్రలు తళతళలాడాలన్నా దీనికి మించిన క్లీనింగ్ ఏజెంట్ మరోటి లేదు. వెండి, బంగారు వస్తువులు, ఆభరణాలను కూడా టమోటా గుజ్జుతో శుభ్రం చేస్తే సరిపోతుంది.