మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:06 IST)

భూమివైపు వేగంగా దూసుకొస్తోన్న గ్రహశకలం.. ప్రమాదకరమేనా?

భూమివైపు ఓ గ్రహశకలం వేగంగా దూసుకొస్తోంది. సుమారు 1.3 కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న గ్రహశకలం మార్చి 4వ తేదీన భూమికి సమీపానికి వస్తుందని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ (జేపీఎల్) ప్రకటించింది. భూమికి 49,11,298 కిలోమీటర్ల చేరువగా వచ్చే ఈ గ్రహశకలంతో ప్రమాదకరమేనని జేపీఎల్ తెలిపింది. 
 
138971 (2001 సీబీ21) పేరుతో పిలిచే ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు జేపీఎల్ పేర్కొంది. కేవలం 400 రోజుల్లోనే ఒక పర్యాయం చుట్టి వస్తోందని.. గంటకు 43,236 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నట్టు వెల్లడించింది.
 
చివరిగా ఇదే గ్రహశకలం 2006లో భూమికి చేరువగా వచ్చి వెళ్లింది. అప్పుడు 71,61,250 కిలోమీటర్ల సమీపానికి వచ్చింది. అంటే ఈ సారి ఇంకొంచెం దగ్గరగా రానుంది. ఈ ఏడాది మార్చి 4 తర్వాత.. మళ్లీ 2043లో ఇదే గ్రహశకలం భూమికి చేరువగా వస్తుందని జేపీఎల్ తెలిపింది.