గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (08:42 IST)

బాలికపై వర్చువల్‌గా సామూహిక అత్యాచారం.. ప్రపంచంలోనే తొలి కేసు

victim woman
యూకేకు చెందిన మైనర్ బాలికపై వర్చువల్‌గా అత్యాచారం జరిగింది. ఈ తరహా కేసు జరగడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. మెటావర్స్‌లో గేమ్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. బాలిక అవతార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత తీవ్ర మానసిక గాయాన్ని అనుభవిస్తుందని పేర్కొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలిక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి ఆటలో లీనమై ఉన్న సమయంలో కొంతమంది యువకులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాలిక శరీరంపై ఎలాంటి గాయలు లేనప్పటికీ వాస్తవ ప్రపంచంలో అత్యాచారం జరిగినట్టుగానే ఆమె వ్యవరిస్తోందని, ఆమె తీవ్రమైన మానసిక గాయాన్ని అనుభవిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
 
ఇలాంటి కేసును పోలీసులు దర్యాప్తు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. బాధిత బాలికకు అయిన మానసిక గాయం చాలాకాలం పాటు ఆమెను వెంటాడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టంలో ఇటువంటి వాటికి సంబంధించి ఎలాంటి నిబంధన లేనందున దీనిపై పోలీసులు ముందుకు ఎలా వెళ్తారన్నది సర్వత్ర చర్చనీయాంశమైంది. కాగా, బాధిత బాలిక ఆ సమయంలో ఎలాంటి గేమ్ ఆడుతోందన్న విషయంలో స్పష్టత లేదు.