గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (19:31 IST)

20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత ప్రధాని కావొచ్చు.. ఆశా జడేజా

KTR
KTR
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఓ మహిళా వ్యాపార వేత్త కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. భారతీయ అమెరికన్ అయిన ఆ మహిళా వ్యాపారవేత్త పేరు ఆశా జడేజా మోత్వాని. ఈ మేరకు కేటీఆర్‌ను కీర్తిస్తూ ఆమె ట్వీట్ కూడా చేశారు.
 
"20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని నా జీవితంలో నేను ఇంత వరకూ చూడలేదు. తెలంగాణ టీం దావోస్‌లో ఫైర్ మీద ఉంది. 
 
కేటీఆర్ తెలంగాణకు బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారు. నాకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వస్తున్నాయి'' అంటూ ఆశా జడేజా మోత్వానీ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలను కూడా జత చేశారు.