బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (14:22 IST)

భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిజమే.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం భారత సైన్యం చేసిన ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతో

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం భారత సైన్యం చేసిన ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అప్పట్లో సంచలనంగా మారిన ఈ ఘటన జరగనే లేదని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది. కానీ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని.. ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి జరిగిందని భారత సైన్యం ప్రకటించింది. 
 
ప్రస్తుతం భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి పలు టీవీ ఛానళ్లు ఆ వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. ఈ వీడియో ఫుటేజీలో డ్రోన్లు, మానవరహిత ఏరియల్‌ వెహికిల్స్‌(యూఏవీ)తో సైన్యం మెరుపు దాడులు చేసినట్లు కనిపిస్తోంది. బంకర్లు, పలు మిలటరీ కట్టడాలు ధ్వంసమైతున్నట్లు, పలువురు మృతి చెందిన వీడియోల్లో దృశ్యాలున్నాయి.  
 
అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌లు దిల్లీ నుంచి వీడియోలు చూస్తూ మెరుపుదాడుల ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. అయితే ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు నిజమేనని నార్తెర్న్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా వెల్లడించారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనంలో పేర్కొంది.