గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (22:11 IST)

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు 31 యేళ్ళ జైలు

Hafiz Saeed
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులకు నిధులు మళ్లించారనే రెండు వేర్వేరు కేసుల్లో జమాత్ ఉద్ దవా అధినేతకు పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. 
 
అలాగే, రూ.3.40 లక్షల అపరాధం కూడా విధించింది. అలాగే, హఫీజ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఆదేశించింది. దీంతో హఫీజ్ సయీద్ మసీదు, మదర్సాను పాక్ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. గత 2020లో టెర్రరిస్టులకు మద్దతిచ్చినందుకు ఉగ్రవాద నేతకు 15 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. 
 
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది చనిపోయారు. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం నిరంతరం అభ్యర్థించినప్పటికీ, పాకిస్థాన్ తిరస్కరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కోర్టు ఆయనకు ఏకంగా 31 యేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునివ్వడం గమనార్హం.