శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 29 నవంబరు 2014 (12:40 IST)

నైజీరియాలోని మాస్క్ వద్ద భీకర కాల్పులు... భారీ పేలుళ్లు: 35 మంది మృతి

ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. 
 
 
ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు మసీదు వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని చెప్పారు.
 
ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని.... ఆ వెంటనే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదన్నారు. 
 
నైజీరియాలోని బోకోహరామ్ తీవ్రవాదులే ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ ఏడాది జరిపిన విధ్వంసంలో దాదాపు 3 వేలమందికి పైగా మరణించారని పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు.