శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (14:04 IST)

చిలీలో భూ ప్రకంపనలు: రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు.. సునామీ హెచ్చరికలు!

తైవాన్ భూకంపం ఘటన మరవక ముందే, చిలీ తీర ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. కోక్వింబో తీరంలో ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూప్రకంపనలకు భయపడి ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప తీవ్రత పొరుగున ఉన్న అర్జెంటీనాను కూడా వణికించింది. 
 
రహదారులపై రాళ్లు విరిగిపడడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు నిపుణులు పేర్కొన్నారు. భవనాలు కూలిపోవడంతో శిథిలాలను తొలగించే పనిలో సహాయక సిబ్బంది ఉన్నారు.