బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (10:51 IST)

అర్జెంటీనాను కుదిపేసిన భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో..

earthquake
అర్జెంటీనాను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, అర్జెంటీనాలోని కార్డోబాకు ఉత్తరాన 517 కి.మీ దూరంలో శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 
 
ది యూరోపియన్- అర్జెంటీనాలోని శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాటోకు 600 కిలోమీటర్ల (372.82 మైళ్లు) లోతులో భూకంపం సంభవించినట్లు మెడిటరేనియన్ సీస్మిక్ సెంటర్ (EMSC) నివేదించింది.
 
పరాగ్వే, అర్జెంటీనాలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అలాగే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు వివరాలు తెలియరాలేదు.