మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (18:27 IST)

2040 నాటికి నీటి కొరతతో నలుగురు బాలల్లో ఒకరే జీవిస్తారు.. ఐరాస షాకింగ్ నివేదిక..!!

ఓజోన్ పొరలో హోల్స్ కారణంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వర్షాలు వానాకాలంలో పడకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి. దీంతో వరదలు కొన్ని ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ

ఓజోన్ పొరలో హోల్స్ కారణంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వర్షాలు వానాకాలంలో పడకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి. దీంతో వరదలు కొన్ని ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు ఏమాత్రం తగ్గట్లేదు. చలికూడా విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు సకాలంలో కురవకపోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నీటి కొరత తీవ్రమవుతోంది. 
 
జనాభా పెరుగుదల, ప్రకృతి సంపద కనుమరుగవడంతో వర్షాలు కరువయ్యాయి. దీంతో 2040 నాటికి అత్యంత పరిమితమైన జలవనరులున్న ప్రాంతాల్లో ప్రపంచంలోని ప్రతి నలుగురు బాలల్లో ఒకరు జీవిస్తారని ఐక్యరాజ్య సమితి షాకింగ్ వాస్తవాన్ని వెల్లడించింది. అంటే 60 కోట్ల మందికి అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉండదని ఐరాస చెప్పకనే చెప్పింది. 
 
ఐక్యరాజ్య సమితిలోని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) విడుదల చేసిన నివేదికలో.. సురక్షితమైన నీరు అందుబాటులో లేకపోవడం ద్వారా బాలల జీవితాలకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించింది. ఇందుకు వాతావరణ మార్పులే కారణమని సదరు నివేదిక తేల్చింది. నీరులేనిదే ఏదీ పెరగదని.. నీరు అత్యంత మౌలికమైందని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆంథోనీ లేక్ గుర్తు చేశారు. 
 
ఇప్పటికైనా సమిష్టి చర్యలకు శ్రీకారం చుట్టకపోతే.. భవిష్యత్తులో నీటి సంక్షోభం తీవ్రతరంగా మారిపోతుందని లేక్ హెచ్చరించారు. తద్వారా బాలల ప్రాణాలకు ముప్పు తప్పదని.. వారి భవిష్యత్తు అంధకారమవుతుందని లేక్ వార్నింగ్ ఇచ్చారు.