1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (09:46 IST)

విమానశ్రయంలోనే దాడులు... 123 కిలోల బంగారం.. 13.3 కోట్ల దోపిడీ.. ఎక్కడ?

దుండగులు ఏకంగా విమానశ్రయంపైనే దాడి చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. 12 మంది సాయుధులు కాల్పులు జరుపుతూ దోపీడీకి తెగించారు. విమానంలోకి ఎక్కాల్సిన బంగారం కలిగిన కార్లపై కాల్పులు జరిపారు. దాదాపు 123 కిలోల బంగారం, రూ.13.3 కోట్ల నగదును దోచుకెళ్లారు. పెరూ దేశంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పెరూ దేశంలో విమానాశ్రయంలో మరికొద్ది సేపట్లో విమానంలోకి లోడ్ కాబోతున్న 123 కిలోల బంగారాన్ని దోచేశారు. 12 మందికి పైగా ఉన్న సాయుధులు రన్వే మీదకు దూసుకొచ్చి, తుపాకులతో కాల్పులు జరిపి బష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో వాళ్లలో ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
తొలుత దొంగలు విమానాల మీదకు కూడా కాల్పులు జరపడంతో.. రెండు విమానాల్లోని ప్రయాణికులు పూర్తిగా కిందకు వంగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. దోచుకున్న తర్వాత అక్కడి నుంచి పొరుగునున్న బొలీవియాకు పారిపోవాలని భావించారు. పట్టుకున్న వాళ్లలో ఒకరు బొలీవియన్ దేశస్థుడు. పెరూలో ఇటీవలి కాలంలో నేరాలు బాగా ఎక్కువవవుతున్నాయి. తమ దేశంలో తాము సురక్షితంగా లేమని దాదాపు 76 శాతం మంది భావిస్తున్నట్లు పెరూలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కూడా తేలింది.