శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (15:13 IST)

మిజోరంలో 39 మంది భార్యలు, 94మంది సంతానంతో 73 ఏళ్ల వృద్ధుడు..?

మిజోరంలో 39 మంది భార్యలు, 94మంది సంతానంతో ఒకే ఇంట్లో 73 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలను చూడటమే అరుదుగా మారిపోయింది. కానీ మిజోరంలో ఓ వృద్ధుడు 181 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో నివాసం వుంటున్నాడు. 
 
మిజోరంకు చెందిన 73 ఏళ్ల జియోనా అనే వ్యక్తి తన 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14మంది కోడళ్లు, 34మంది మనవ, మనవరాళ్లతో కలిసి నివసిస్తున్నాడు. వీరంతా ఉమ్మడి కుటుంబంలా జీవిస్తున్నారు. వీరితో పాటు పెంపుడు జంతువులు కూడా వున్నాయి.
 
వీరి కుటుంబ సభ్యులను చూసి ఆ ప్రాంత వాసులంతా షాక్ తింటున్నారు. ఒక కుటుంబమే చిన్న గ్రామంలా దర్శనమిస్తోందని.. మిజోరంకు సంబంధించిన ఫోటోను.. నెట్టింట్లో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.