బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:56 IST)

నా పేరు రాకిబ్, మదరసాలో చదువుకుంటున్న బాలికపై అత్యాచారం చేసాను...

మహిళలపై అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా వాటిని ఆపడం ఎవరి తరం కావట్లేదు. కొన్ని దేశాలలో వీటికి సంబంధించి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. మొన్నామధ్య అరబ్ దేశాలలో రేప్ చేసిన నేరస్తుడిని రెండు గంటల వ్యవధిలోనే పట్టుకుని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్చి చంపారు. అయితే అన్ని దేశాలలో ఈ పరిస్థితి లేదు. న్యాయం జరగడంలో జాప్యం, చట్టాలలోని లొసుగులతో రేపిస్ట్‌లు సులభంగా తప్పించుకుంటున్నారు.
 
ఇదేవిధంగా బంగ్లాదేశ్‌లో న్యాయం జరగడంలో ఆలస్యమైందో ఏమో తెలియదు గానీ, ఒక వ్యక్తి రేపిస్టులను వరుసగా హత్య చేయడం మొదలుపెట్టాడు. అందరినీ ఒకేవిధంగా హత్య చేసి, మెడలో వారి నేరానికి సంబంధించిన వివరాలతో కాగితాన్ని ఉంచాడు. అతని పేరు హెర్క్యులస్. ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న పేరు ఇది. 
 
మదరసాలో చదివే బాలికను కొంతమంది వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారు. అందులో ఒకడైన రాకిబ్ అనే వ్యక్తిని చంపి, అతని మెడలో "నా పేరు రాకిబ్, మదరసాలో చదువుకుంటున్న బాలికపై అత్యాచారం చేసాను" అనే కాగితం ఉంచాడు. దానితో పాటుగా "రేపిస్ట్‌లు జాగ్రత్త" అంటూ హెచ్చరికను కూడా జోడించాడు. అలా వివిధ రేప్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని చంపాడు హెర్క్యులస్ ఇప్పటికి. మరి పోలీసులు పట్టుకునేలోపు ఎంత మందిని చంపుతాడో మరి.