ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (13:33 IST)

నానాటికీ దిగజారిపోతున్న పాక్ ఆర్థిక పరిస్థితి... ఒక్క కోడిగుడ్డు ధర రూ.32

Eggs
పాకిస్థాన్ దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. దీంతో ఆ దేశంలో అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికంటుతున్నాయి. దీనికి నిదర్శనమే ఒక కోడిగుడ్డు ధర ఏకంగా రూ.32 పలుకుతుంది. ఈ ధరలతో ఆ దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. 
 
పాకిస్థాన్ దేశంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండంతో విదేశాల నుంచి దిగుమతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదేశంలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి తాకాయి. ఒక్కో కోడిగుడ్డు ధర రూ.32గా పలుకుతుంది. దీంతో కోడి గుడ్లను కొనాలంటేనే పాక్ ప్రజలు వణికిపోతున్నారు. పౌల్ట్రీ ఫామ్‌లలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో ప్రస్తుత పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 
 
దీంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు. 30 డజన్ల గుడ్ల ధర రూ.10500 నుంచి రూ.12500కు పెరుగుతుంది. తీవ్ర ఆ దేశ పాలకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డజను కోడిగుడ్లను రూ.360కు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఈ సంక్షోభ సమయాన్ని రీటైల్ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని దోచుకుంటున్నారు.