శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:57 IST)

ఆగంతకుల కాల్పులు.. అమెరికాలో మరో తెలుగు యువకుడి మృతి

అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ కొలంబస్‌లో తుపాకీ తూటాకు తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దోపిడీదారులు జరిపిన కాల్పుల్లో ఏలూరు జిల్లా వాసి సాయూస్ వీర (24) మృతి చెందాడు. 
 
ఓహాయో రాష్ట్ర రాజధాని నగరం కొలంబస్ ప్రాంతంలో ఫ్రాంక్లిన్ గ్యాస్ స్టేషన్ వెనుక ఫుడ్ కోర్టు ఉంది. ఈ ఫుడ్ కోర్టులోకి ప్రవేశించిన ఆగంతకులు.. తుపాకీలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయీశ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 
 
వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌లో సాయూశ్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. సాయీశ్ మరణం అతడి కుటుంబంలో పెను విషాదం నింపింది.