Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గ్రీన్‌కార్డు నిబంధనలను ఎత్తివేతకు అమెరికన్ కాంగ్రెస్ నేతల డిమాండ్.. భారత్‌కు మేలు

హైదరాబాద్, శుక్రవారం, 14 జులై 2017 (05:51 IST)

Widgets Magazine

అమెరికాలో నివసించే భారతీయ ఉద్యోగులు, వ్యాపారులు శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డ్‌ పొందాలంటే 12 ఏళ్ల పాటు నిరీక్షించాలంటూ వచ్చిన వార్తలపై అమెరికా నేతలు స్పందించారు. దీనికి సంబంధించి ఒక బిల్లును కాన్సస్‌ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ నేత కెవిన్‌ యోడర్‌ ప్రవేశపెట్టారు. ఈ సమస్యకు కారణమైన ‘దేశ ఆధారిత’ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ నిబంధన ఉండటం వల్ల భారత్, చైనా వంటి అధిక జనాభా దేశాల నుంచి వచ్చే వారికి అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో ఉన్న 230 మందిలో ఇప్పటికే 100 మందికి పైగా నేతలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.
 
ఈ బిల్లు ఆమోదం పొందితే ‘దేశ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ జారీ’ నిబంధనని తొలగిస్తారు. ప్రస్తుతం ఈ నిబంధనల ప్రకారం స్వతంత్ర దేశం నుంచి వచ్చిన ఉద్యోగుల కుటుంబాలకు కోటా ప్రకారం గ్రీన్‌కార్డులు మం జూరు చేయాలి.  దీంతో భారత్, చైనాల నుంచి వచ్చిన వారితో సమానంగా చిన్న దేశం గ్రీన్‌లాండ్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకూ గ్రీన్‌కార్డులు అందుతున్నాయి. 
 
పెద్ద దేశాల నుంచి దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం వారి గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అలాగే ఈ బిల్లు అమలులోకి వస్తే తాత్కాలిక వీసా మీద అమెరికాలో పనిచేసే వారికి కూడా మరింత ప్రయోజనం   చేకూరనుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒళ్లొంచి పనిచేయడంలో తేడాలే ఊబకాయానికి అసలైన వనరు

అమెరికాలో సగటున ప్రజలు ప్రతిరోజూ 4,700 మెట్లు ఎక్కుతారట. మెక్సికోలో కూడా ప్రజలు సగటున ...

news

చైనా పనిపట్టే క్షిపణి దక్షిణ భారత్‌లో నిర్మాణం.. అది తయారైతే మాత్రం చైనాకు కారుడే..

స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత చైనాకు వణుకు పుట్టించే బ్రహ్మాస్త్రాన్ని భారత్ ...

news

రంగస్వామి నాయుడుకి చంద్రబాబు సంతాపం(వీడియో)

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌కు ...

news

స్మశానంలో ప్రియుడి శవానికి ముద్దులు పెట్టిన ప్రియురాలు... అదే తొలిసారి...

పింటరెస్ట్ ద్వారా వారిద్దరికీ పరిచయమైంది. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పరస్పరం ...

Widgets Magazine