Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యుద్ధం ప్రకటిస్తే ఉత్తర కొరియా భస్మమై పోతుంది : అమెరికా

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (07:13 IST)

Widgets Magazine
pentagon

అమెరికా తమ మీద యుద్ధాన్ని ప్రకటించిందన్న ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో ఆరోపణను వైట్‌హౌస్ కార్యదర్శి సారా శాండర్స్ తీవ్రంగా ఖండించారు. మేం ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించలేదు. అటువంటి ఆలోచనే లేదు. ఒకవేళ యుద్ధమంటూ ప్రకటిస్తే ఉత్తర కొరియా భస్మమైపోతుందని హెచ్చరించారు. 
 
ఈ విషయంలో ఉత్తర కొరియా మంత్రి రీ యాంగ్ హో ప్రకటన అసంబద్ధం అని శాండర్స్ మంగళవారం మీడియాతో అన్నారు. అంతర్జాతీయ సముద్ర జలాలపై తిరిగే ఒక బాంబర్‌ను కూల్చేస్తామని మరో దేశం పేర్కొనడం సరికాదు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను నిరోధించడమే మా లక్ష్యం అని శాండర్స్ స్పష్టం చేశారు. 
 
అంతకుముందు... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశంపై యుద్ధం ప్రకటించాడని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రి రియాంగ్‌హో ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ యుద్ధ ప్రకటన ద్వారా అమెరికా బాంబర్లను ఏ క్షణాన్నైనా కూల్చే అవకాశాన్ని ట్రంప్ అన్యాపదేశంగా ఉత్తర కొరియాకు ఇచ్చినట్లయ్యిందని రియాంగ్ హో అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలన్నీ గమనించాలి. ముందుగా యుద్ధ ప్రకటన చేసింది ట్రంప్. మేము కాదు అని ఆయన పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వచ్చేనెల 21తో భూమి అంతమా?

వచ్చే నెల 21వ తేదీతో భూమి అంత కాబోతుందట. ఈ మాట చెపుతున్నది ఎవరో కాదు... పరిశోధనల్లో ...

news

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేయడం, పోలవరం ప్రాజెక్ట్ పెరిగిన వ్యయం అంచనాలకు ...

news

అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లో లక్ష గృహ ప్రవేశాలు.. మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి : రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ సహాయంతో ...

news

ఒక యజ్ఞంలాగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం... చంద్రబాబు

‘‘ఒక పవిత్ర యజ్ఞంగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం. ఎక్కడా పనులు ఆగకూడదు, ...

Widgets Magazine