Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మేకిన్ ఇండియాకు బూస్ట్‌లా జీఎస్టీ : మోడీపై చైనా మీడియా ప్రశంసలు

బుధవారం, 12 జులై 2017 (06:52 IST)

Widgets Magazine
narendra modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. మోడీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి జీఎస్టీ ఓ బూస్ట్‌లా పని చేస్తుందని చైనా మీడియా చెప్పుకొచ్చింది. 
 
నిజానికి భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యం నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. చైనా మీడియా కూడా భారత్‌ను తూర్పారబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై మోడీపై చైనా మీడియా ప్రశంసలు కురిపించడం గమనార్హం.
 
భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అమోఘమని కీర్తించింది. జీఎస్‌టీ చాలా గొప్పదని, ఆ ఘనత మోడీకే దక్కుతుందని కొనియాడింది. జీఎస్టీ కారణంగా లో-కాస్ట్ తయారీ రంగం నెమ్మదిగా ఇండియాపై మరలుతుందని, ప్రపంచ మార్కెట్లోని తమ ఆధిపత్యాన్ని త్వరలోనే భారత్ భర్తీ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
ముఖ్యంగా, మేకిన్ ఇండియాకు జీఎస్‌టీ బూస్ట్‌లా ఉపయోగపడుతుందని పేర్కొంది. జీఎస్‌టీ రాష్ట్రాల పన్నుల్లో ఉన్న తేడాలు సమసిపోయానని వివరించింది. ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్ ఏర్పడుతుందని, దీనివల్ల దేశానికి మంచే జరుగుతుందని వ్యాఖ్యానించింది. జీఎస్టీ వల్ల భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ‘గ్లోబల్ టైమ్స్’ తన కథనంలో వివరించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

‘డ్వాక్రా’ గ్రూపుల నిర్వాహణలో తుఫాను షెల్టర్లు...

ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని 9 తీర ప్రాంత జిల్లాల్లో 138 అత్యాధునిక ...

news

అతివేగానికి బీటెక్ విద్యార్థి మృతి.. బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం (Video)

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో మరో ఘోర రోడ్డు ...

news

ప్రియురాలి శవాన్ని బైకుపై వేసుకుని తీసుకొచ్చిన ప్రియుడు... ఏం జరిగిందంటే?

కర్నాటకలో ఓ యువతి శవాన్ని బైకుపై వేసుకుని రోడ్డుపై వెళుతున్న యువకుడిని చూసి షాక్ తిన్నారు ...

news

మరో 40 యేళ్ళు జగనే సిఎం... నవ హామీలపై నా సవాల్... రోజా(వీడియో)

ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే జగన్ ఇచ్చిన 9 హామీలను ఎలా ...

Widgets Magazine