శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (16:15 IST)

కేరళలో రబ్బర్ కోడిగుడ్లు.. చైనా చేతివాటం.. ఉడకబెట్టామో.. బాల్‌ అయిపోద్ది..

కోడిగుడ్డు రబ్బర్ బాల్ ఎలా అయ్యింది. చైనా వాణిజ్య పటిమకు కేరళ కొమ్ము కాస్తోంది. చైనా కృత్రిమ కోడిగుడ్లను తయారు చేస్తూ మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. అయితే కేరళలోని వామపక్ష సర్కారు ఏమీ తెలియనట్లుగా వ్య

కోడిగుడ్డు రబ్బర్ బాల్ ఎలా అయ్యింది. చైనా వాణిజ్య పటిమకు కేరళ కొమ్ము కాస్తోంది. చైనా కృత్రిమ కోడిగుడ్లను తయారు చేస్తూ మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. అయితే కేరళలోని వామపక్ష సర్కారు ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా కేరళ మార్కెట్‌లో కనిపించిన చైనా గుడ్లు కలకలం రేపుతున్నాయి. చైనా గుడ్లను కోళ్లు పెట్టవు. వాటిని కెమికల్స్ వాడి తయారు చేస్తుంటారు.
 
గోధుమ రంగులో ఈ కోడిగుడ్లపై ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ గుడ్లను సూపర్ మార్కెట్‌లోకూడా అమ్ముతున్నారు. మామూలు కోడిగుడ్ల కంటే ఇది గట్టిగా ఉంటుంది. నీటిలో ఉడకబెట్టామనుకోండి.. రబ్బర్ బాల్‌లా తయారవుతుంది. అదీ చైనా కోడిగుడ్డు కథ. రుచి మన ఊరి గుడ్డులా ఉండదంతే. ఎన్ని నెలలైనా చెడిపోని ఈ గుడ్లు తమిళనాడు నుంచి కేరళకు వస్తున్నాయని ఆరోపణలున్నాయి. 
 
ఈ నేపథ్యంలో చైనా కోడిగడ్లపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో చైనా నుంచి ప్లాస్టిక్ రైస్ దిగుమతై కలకలం సృష్టించిన నేపథ్యంలో.. చైనా కృత్రిమ కోడిగుడ్లపై రచ్చ రచ్చ జరుగుతోంది.