గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (12:29 IST)

సిరియా మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి.. వందమందికి పైగా మృతి

సిరియా మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడి వందమందికి పైగా మృతి చెందారు. ఇది ఉగ్ర సంస్థల పనేనని ప్రభుత్వ మీడియా ఆరోపించింది. మరోవైపు, కుర్దిష్ అధీనంలోని ఈశాన్య ప్రాంతంపై జరిగిన టర్కీ విమాన దాడుల్లో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు.
 
ఈ డ్రోన్ దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. మృతుల్లో 14 మంది పౌరులు కూడా ఉన్నట్టు పేర్కొంది. మరో 125 మంది వరకు గాయపడి ఉంటారని వివరించింది.
 
సెంట్రల్ సిటీ అయిన హామ్స్‌లోని మిలటరీ అకాడమీలో జరుగుతున్న ఆఫీసర్స్ గ్రాడ్యుయేషన్ వేడుకను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్టు ఆర్మీ తెలిపింది.