గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:08 IST)

పెరూలో ఘోర ప్రమాదం : బస్సు లోయలోపడి 20 మంది మృతి

పెరూ దేశంలో ఘోరం ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో జరిగింది. 
 
తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళుతున్న బససు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలోపడింది. వంద మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. 
 
పలువురు చిన్నారులతో పాటు మొత్తం 20 మంది మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ బస్సు అతివేగం, రోడ్లు సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఈ ప్రమాదం నుంచి బయటపడిన క్షతగాత్రులు వెల్లడించారు. 
 
కాగా, గత యేడాది నవంబరు నెలలో ఉత్తర పెరువియన్ అటవీ ప్రాంతంలో ఓ మినీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. రెండు నెలలు గడవక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.