గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (13:13 IST)

ఐసిస్ చీఫ్ కథకు ఫుల్‌స్టాప్.. డీఎన్ఏ టెస్టు కోసం అండర్‌వేర్ దొంగలించారట..

ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అంతమొందించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అమెరికా, కుర్దిష్ ఆధ్వర్యంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలు వేసిన పకడ్బందీ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. బాగ్దాదీ కథను సమాప్తం చేయడంలో అతడి అండర్ వేర్ కూడా ఈ దళాలకు తోడ్పడింది. ఈ భద్రతా బలగాలకు సీనియర్ అడ్వైజర్, అండర్ కవర్ ఏజెంట్ కూడా అయిన పోలాట్ కాన్ అనే వ్యక్తి.. డీఎన్ఏ ఐడెంటిఫికేషన్ కోసం బాగ్దాదీ అండర్ వేర్‌ని దొంగిలించాడట. 
 
ఈ నరహంతకుడి డెన్ పై దాడికి ఇంటెలిజెన్స్ వర్గాల కృషి తాలూకు డీటైల్స్‌ని ఆయన ట్వీట్ చేశాడు. బాగ్దాదీని ట్రాక్ చేసేందుకు, చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసేందుకు మే 15 నుంచే తాము సిఐఏతో కలిసి పని చేస్తూ వచ్చామని పేర్కొన్నాడు. 
 
బాగ్దాదీ తాను పట్టుబడకుండా తరచూ ప్రాంతాలు, నివాసాలు మారుస్తుంటాడని, ఇది తెలిసిన సీఐఏ ఏజెంట్లు అతడు కచ్చితంగా ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకోగలిగారని పోలాట్ తెలిపారు. ఈ ఐసిస్ చీఫ్ ఎలాగైనా మరణిస్తాడని ఊహించి మా ఏజెంట్లలో ఒకరు డీ‌ఎన్‌ఏ టెస్ట్ కోసం అతని అండర్ వేర్ దొంగిలించి తెచ్చాడని చెప్పారు.  
 
ఇదిలా ఉంటే.. బాగ్దాదీని అంతమొందించడంలో సిరియన్-కుర్దిష్ దళాలు ఎంతో సహకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఇరాక్, సిరియా, రష్యా దేశాలను కూడా ఆయన ప్రశంసించి వాటికి ధన్యవాదాలు తెలిపారు.