Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికా ట్రంప్ సర్కారు కొత్త బిల్లు: గ్రీన్ కార్డులను 45శాతం పెంచనున్నారట

గురువారం, 11 జనవరి 2018 (14:14 IST)

Widgets Magazine

భారతీయులకు మేలు చేసే బిల్లుకు అమెరికా సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిభగల వారికే అమెరికాలో ప్రవేశం అన్నట్టుగా గ్రీన్ కార్డులను వార్షికంగా 45 శాతం పెంచే ప్రతిపాదనలతో కూడిన బిల్లును అక్కడి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అమెరికాలో నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డులను సొంతం చేసుకునే వారిలో సింహ భాగం భారతీయులదే. ఈ బిల్లు చట్టంగా మారితే ఇక భారత ఐటీ ఇంజనీర్లు పండగ చేసుకున్నట్టే. 
 
ఇప్పటికే అమెరికా ట్రంప్ సర్కార్ మద్దతుతో ఈ బిల్లు ప్రతినిధుల సభకు చేరింది. ఇక ఈ బిల్లు ఆమోదం పొంది, అద్యక్షుడి సంతకం కూడా పూర్తయి చట్టంగా మారితే, ప్రస్తుతమున్న వైవిధ్య వీసా కార్యక్రమానికి మంగళం పాడినట్లవుతుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ బిల్లుతో ప్రతిభగల నిపుణులు రాక 2.6 లక్షలకు తగ్గిపోతుంది. ప్రస్తుతం అమెరికా ఏటా 10.5 లక్షల మంది నిపుణులకు అవకాశం కల్పిస్తుంది. 
 
అంటే భారీ సంఖ్యలో నిపుణుల రాకను అమెరికా ఈ బిల్లుతో చెక్ పెడుతోంది. ఒక విధంగా ఇది ప్రతికూలతే. ప్రస్తుతం ఏటా 1,20,000 లక్షల గ్రీన్ కార్డులను ఇస్తుండగా, ఈ సంఖ్యను 45 శాతం పెంపుతో 1,75,000 చేయాలని ఈ బిల్లుతో ప్రతిపాదించారు. భారత ఐటీ ఇంజనీర్లు హెచ్1బి వీసాతోనే అమెరికాకు వస్తున్నారు. ఆ తర్వాత గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని శాశ్వత నివాస హోదా దక్కించుకుంటున్నారు.
 
తాజా బిల్లు ప్రకారం ప్రస్తుతం కేటాయిస్తున్న గ్రీన్‌ కార్డుల సంఖ్య సంవత్సరానికి లక్ష 20వేలనుంచి ఒక లక్ష, 75వేలకు  పెరగనుంది. ఈ ప్రతిపాదనతో  గ్రీన్‌ కార్డుకోసం వేచిచూస్తున్న 5లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమరావతి నిర్మాణంలో బాబు ప్లాన్ బాగుంది.. కల్లు తాగుతూ.. నారాయణ

అమరావతిలో సీపీఐ జాతీయ నేత నారాయణ సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. గురువారం ఉదయం పూట సైకిల్‌పై ...

news

పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసి క్రీమ్ పూస్తే బాబు తలకు మంట(వీడియో)

పుట్టినరోజునాడు పిల్లలందర్నీ పిలిచి కేక్ కట్ చేసి ఆ కేకులో వున్న క్రీమ్ ను పిల్లల ...

news

తల్లికి వివాహం చేసిన పెళ్లీడుకొచ్చిన కుమార్తె .. ఎక్కడ? ఎలా?

సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి ...

news

ఫేస్‌బుక్, వాట్సాప్‌లు వాడే అమ్మాయిలా? వద్దే వద్దంటున్న యువకులు?

స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లంటేనే యువత పడిచస్తోంది. ...

Widgets Magazine