బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (14:48 IST)

అమ్మాయిల కోసం ఉగ్రవాదులను వదిలిపెట్టిన నైజీరియా

బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది

బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది పాఠశాల విద్యార్థినుల్లో 82 మంది విడిచిపెట్టారు. మిగిలిన వారిని కూడా విడిపించేందుకు నైజీరియా సర్కారు చర్యలు చేపట్టింది. 
 
దాదాపు మూడేళ్ల క్రితం చిబుక్‌లోని పాఠశాలపై దాడి చేసిన బోకోహరామ్ ఉగ్రవాదులు 200 మందికి పైగా అమ్మాయిలను అపహరించుకుపోగా, ఆపై అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో 21 మందిని విడిచిపెట్టగా, ఇపుడు మరో 82 మందిని వదిలిపెట్టారు. ఆపై ఉగ్రవాదులతో నైజీరియా ప్రభుత్వం నెలల తరబడి చర్చలు జరిపింది. తాము జరిపిన చర్చలు ఇప్పటికి ఫలవంతం అయ్యాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
 
తమ సెక్యూరిటీ అధికారులకు ఉగ్రవాదులు అమ్మాయిలను అప్పగించారని తెలిపారు. వీరిని అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ స్వయంగా కలుస్తారని తెలిపారు. వీరందరూ ప్రస్తుతం సైన్యం అధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. బందీలుగా ఉన్న మిగతా వారిని కూడా విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తాము విడిచిపెట్టిన ఉగ్రవాదుల వివరాలను మాత్రం నైజీరియా ప్రభుత్వం వెల్లడించలేదు.