Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన పురుషుడు... ఎక్కడ?

ఆదివారం, 9 జులై 2017 (12:10 IST)

Widgets Magazine
british man

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటి ఫేస్‌బుక్. ఈ ప్రసారమాద్యమం ద్వారా అనేక మంది యువతీయువకులు ఒక్కటవుతున్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. ఇలా కొన్ని కోట్ల మందిని ఒక్కటిగా చేస్తూ అనుసంధానకర్తగా ఫేస్‌బుక్ ఉంది. అంతేకాదండోయ్... ఓ పురుషుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు కూడా దోహదపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిటన్‌కు చెందిన 21 యేళ్ళ పురుషుడు స్త్రీ లక్షణాలతోనే జన్మించాడు. తర్వాత అతను లింగమార్పిడి చేయించుకున్నాడు. పిల్లలను కనేందుకు అతను ఫేస్‌బుక్ సాయంతో స్పెర్మ్‌డోనర్‌ కోసం గాలించాడు. ఓ రిక్వెస్ట్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన ఓ ఫేస్‌బుక్ యూజర్ తన వీర్యాన్ని దానం చేశాడు. ఈ వీర్యం సాయంతో గర్భందాల్చాడు. అతను ఆడ శిశువుకు జన్మనిచ్చాడు. ట్రినిటీ లీఫ్ అని పేరు కూడా పెట్టారు. అతని పేరు హెడెన్ క్రాస్‌.
 
కాగా, హెడన్ తన సెక్స్ మార్పిడికి హార్మోన్ థెరపీని తన 18వ ఏటనే ఆశ్రయించాడు. ఒకసారి అతను సెక్స్ థెరిపీని నిలిపివేసి, బిడ్డకు జన్మనివ్వాలనుకున్నాడు. అయితే అప్పటికే అతనికి లీగల్‌గా పురుషునిగా గుర్తింపు వచ్చింది. కానీ అతనికి పూర్తిస్థాయిలో పురుష హార్మోన్లు అందలేదు. అతను లీగల్‌గా బిడ్డను కనేందుకు స్మెర్మ్‌డోనర్‌ను వెతకాల్సి వచ్చింది. ఇందుకోసం అతను ఫేస్‌బుక్‌ను ఆశ్రయించగా, అతని కృషి ఫలించింది. హెడెన్ క్రాస్ గర్భం ధరించి.. శిశువుకు జన్మనిచ్చాడు. కాగా ఈ ఉదంతపై బ్రిటన్‌లో దుమారం చెలరేగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫ్లాష్.. ఫ్లాష్.. నాగాలాండ్ సీఎంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు

నాగాలాండ్‌ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షురోజెలీ లీజీట్స్‌పై 40 ...

news

రెండున్నరేళ్ళలో 465 మందిని చంపేసిన పాకిస్థాన్ సర్కారు

గడచిన రెండున్నరేళ్ళలో 465 మందిని పాకిస్థాన్ సర్కారు ఉరితీసి చంపేసింది. అయితే, వీరింతా ...

news

కర్నూలులో టీడీపీ షాక్.. : వైకాపాలో చేరనున్న శిల్పా చక్రపాణి రెడ్డి?

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ ...

news

ఆయన జేసీ దివాకర్ రెడ్డి.. విమానం ఎక్కనీయొద్దు :: వెనుదిరిగిన టీడీపీ ఎంపీ!

అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొలి దెబ్బ ...

Widgets Magazine