శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (12:06 IST)

ఇంగ్లండ్ మోడల్ కిడ్నాప్ : రూ.1.9 కోట్లకు శృంగార బొమ్మగా విక్రయం

ఓ మోడల్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేసి.. ఆమెను రూ.1.9 కోట్ల శృంగార బొమ్మగా ఆన్‌లైన్‌లో విక్రయించాడు. ఈ దారుణం ఇంగ్లండ్‌లో జరిగింది.

ఓ మోడల్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేసి.. ఆమెను రూ.1.9 కోట్ల శృంగార బొమ్మగా ఆన్‌లైన్‌లో విక్రయించాడు. ఈ దారుణం ఇంగ్లండ్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. లండన్‌లోని కూల్‌స్టన్ అనే ప్రాంతానికి చెందిన క్లో ఆయిలింగ్ (20) అనే యువతి మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. ఈమె గత నెలలో ఫోటో‌షూట్‌లో పాల్గొనేందుకు ఇటాలీలోని మిలన్ పట్ణానికి వెళ్లింది. 
 
ఆమెను లండన్ నుంచి ఫాలో అయిన ఓ అగంతకుడు ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి తన కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమెను ఆరు రోజుల పాటు ఓ ఇంట్లో బందీగా ఉంచాడు. ఆ తర్వాత ఆ యువతిని సెక్స్ బొమ్మగా పేర్కొంటూ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. దీంతో ఆమెను కొనుగోలు చేసేందుకు పలువురు కోటీశ్వరులు ఆసక్తి చూపడంతో ఆమె ఏకంగా రూ.1.9 కోట్లకు అమ్ముడు పోయింది. 
 
ఇంతలో మత్తు వీడి తెలివిలోకి వచ్చిన ఆ మోడల్.. తాను ఓ గదిలో కాళ్లు చేతులు కట్టేసి బందీగా ఉన్న విషయం గుర్తించింది. ఇంతలో ఆ మోడల్ ఓ బిడ్డకు తల్లి అనే విషయాన్ని తెలుసుకున్న అంగతుకుడు ఆమెను వదిలిపెట్టాడు. దీనిపై క్లో మాట్లాడుతూ... ఈ సంఘటన తన జీవితంలో మరిచిపోలేనిది. ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తాననే నమ్మకం లేకుండా పోయింది. కానీ, ఇంగ్లండ్, ఇటాలీ పోలీసు అధికారులు తనను సురక్షితంగా అగంతకుడి నుంచి రక్షించారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పింది.