గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (15:59 IST)

మంటల్లో చిక్కుకున్న బల్గేరియా బస్సు-45మంది సజీవదహనం

బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 45మంది సజీవదహనం అయ్యారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా ఈ బస్సు మంటల్లో చిక్కుకుంది. 
 
ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.  ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాసిడోనియా రాయబార కార్యాలయం ప్రతినిధులు బాధితులను తీసుకెళ్లిన ఆసుపత్రిని సందర్శించారని బల్గేరియన్ వార్తా సంస్థ నోవినిట్ తెలిపింది. ప్రమాదానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.