మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (13:40 IST)

శునకం కోసం సింహంతో తలపడిన యజమాని.. చివరికి ఏమైందంటే?

కుక్క కోసం ఆ యజమాని సింహంతో తలపడింది. కానీ ఈ పోరాటంలో శునకం ప్రాణాలు విడిచింది. యజమాని స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కాలిఫోర్నియా దక్షిణాన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ పెంచుకుంటున్న కుక్కపై కన్నేసిన పర్వత సింహం మెల్లిగా ఆ కుక్క దగ్గరకు వచ్చింది. ఒక్కసారిగా దానిపైకి ఉరికింది. కుక్క అరుపులు విన్న దాని యజమాని... సింహాన్ని చూసి కూడా భయపడకుండా ఇంట్లోంచీ బయటికొచ్చింది. 
 
సింహాన్ని తరిమేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ కుక్కకు ఆ సింహం వదల్లేదు. కానీ సింహం దగ్గరకు వెళ్లి ఆమె పిడికిలి బిగించి సింహం ఎడమ బుగ్గపై గట్టిగా ఒక్కటిచ్చింది. అంతే దవడ పక్కకుపోయినట్లు ఫీలైంది సింహం. కుక్కను వదిలేసింది. ఆమె వైపు కోపంగా చూసింది. ఆమెపైకి ఉరికింది. ఆమె కూడా అలాగే ఎదురుతిరిగి సింహాన్ని పిడిగుద్దులు గుద్దింది. ఈ ఘటనలో ఆమెకు చిన్నపాటి గాయాలైనాయి. 
 
కుక్కను లాక్కున్న ఆమె గట్టిగా అరుస్తూ కేకలు వేయడంతో.. సింహానికి భయం వేసి అక్కడ నుంచి పారిపోయింది. సింహం నోట్లో బాగా నలిగిపోయిన ఆ కుక్క ప్రాణాలు విడిచింది. ఆమె స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.