గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 10 నవంబరు 2016 (14:01 IST)

కెనడా పారిపోయేందుకు సిద్ధమవుతున్న అమెరికన్ యువత... ట్రంప్ భయం... ఎందుకని?

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికై 24 గంటలు కూడా గడవక ముందే అక్కడ ట్రంప్ తమ దేశ అధ్యక్షుడు కాదంటూ నిరసనలు మిన్నంటుతున్నాయి. యువతీయువకులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. మరోవైపు కెనడా పారిపోతున్నామంటూ అమెరికన్ యువతీయువకులు కొందరు

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికై 24 గంటలు కూడా గడవక ముందే అక్కడ ట్రంప్ తమ దేశ అధ్యక్షుడు కాదంటూ నిరసనలు మిన్నంటుతున్నాయి. యువతీయువకులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. మరోవైపు కెనడా పారిపోతున్నామంటూ అమెరికన్ యువతీయువకులు కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ఉద్యోగాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నేపధ్యంలో తాము కెనడా పారిపోడం మినహా మరో దారి లేదంటూ వ్యాఖ్యానించారు. 
 
గతంలో కూడా వారు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ శ్వేతసౌథం పీఠాన్ని అధిష్టించడంతో ఆరోజు చెప్పినవారంతా ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం ఏంటయా అంటే... బుధవారం ట్రంప్ విజయం దిశగా దూసుకుపోతున్నప్పుడు చాలామంది ట్రంప్ టోర్నడో అని నినాదాన్ని జోడించడం మొదలుపెట్టారు. 
 
అంతేకాదు కెనడా ప్రధాన ఇమ్మిగ్రేషన్ సైట్‌ను భారీగా వీక్షించినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లిపోయేందుకు తట్టాబుట్టా సర్దుకున్నట్లు అవగతమవుతోంది. ఇమ్మిగ్రేషన్ సైటును విపరీతంగా చూడంతో అది కాస్తా క్రాష్ అయినట్లు వార్తలు వచ్చాయి. మరి ట్రంప్ అంటే వారికి అంత భయం ఎందుకు పట్టుకుందో...?