శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:40 IST)

కరోనాతో తండ్రి బాధపడితే.. అన్నం పెట్టే వాడు లేడు.. పిల్లాడు మృతి

చైనా ప్రభుత్వం కరోనాపై పోరాటం చేస్తోంది. తమ పౌరుల ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 20వేల మందికి పైగా సోకిన నేపథ్యంలో చైనా సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్ దెబ్బకు మృతుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 400కి దాటింది. తాజాగా చైనాలో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌కు చెందిన యాంగె చెంగ్‌.. వయసు 16 ఏళ్లు. అంటే తన కాళ్ళ మీద తాను బ్రతికే పరిస్థితి లేదు.
 
అతడు సెరిబ్రల్‌ పాల్సీ బాధితుడు. ఆ బాలుడి తండ్రి కరోనా వైరస్‌ బారిన పడ్డాడనే అనుమానంతో స్థానిక అధికారులు అతణ్ని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ పిల్లాడికి అన్నం పెట్టేవాడు లేకపోయాడు. దీనితో ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ బాలుడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను చైనా ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది.