గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (17:18 IST)

విమానంపై పేరును తప్పుగా పెయింటిగ్... తిరిగి పంపించిన ఎయిర్ లైన్స్...

హాంకాంగ్‌కు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ క్యాథే పసిఫిక్ వాళ్ళ కొత్త విమానాన్ని వెనక్కి తిప్పి పంపించేశారు. అందుకు ముఖ్యకారణం వారి పేరును తప్పుగా రాయించినందు వలనే. ఆ విమానం వెలుపలి భాగంలో cathay pacific అ

హాంకాంగ్‌కు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ క్యాథే పసిఫిక్ వాళ్ళ కొత్త విమానాన్ని వెనక్కి తిప్పి పంపించేశారు. అందుకు ముఖ్యకారణం వారి పేరును తప్పుగా రాయించినందు వలనే. ఆ విమానం వెలుపలి భాగంలో cathay pacific అనే పేరు పెయింట్ చేయకుండా cathay paciic అని పెయింట్ చేశారట. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికులు విమానంపై ఆ పేరును గుర్తించి వెంటనే ఎయిలైన్స్‌కు తెలియజేశారు.
  
 
ఇక ఎయిర్ లైన్స్ ఇది చాలా తప్పని చెప్పి ఆ విమాన్ని వెంటనే తిరిగి మంపించేశారు. దీనిపై ఊప్స్.. ఈ పేరు ఎక్కువ కాలం ఉండదు.. ఇది మళ్లీ షాప్‌కు వెళుతోందంటూ జోకింగ్ ట్విట్ చేసింది. ఈ అంశాన్ని క్యాథే పసిఫిక్ సులువుగా తీసుకున్నప్పటికీ ఏవియేషన్ రంగం మాత్రం ఈ విషయాన్ని సీరియస్ మిస్టేక్‌గానే భావిస్తున్నారు.