మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (11:40 IST)

అప్పుడు పాకిస్థాన్.. ఇప్పుడు చైనా హెలికాఫ్టర్.. భారత గగనతలంలో..?

పాకిస్థాన్‌కు చెందిన హెలికాఫ్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించింది. గమనించిన భారత వైమానిక దళం కాల్పులు జరపపడంతో ఆ హెలికాఫ్టర్ తోకముడిచి పారిపోయింది. తాజాగా.. చైనాకు చెందిన రెండు హెలికాఫ్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించడమే కాకుండా ఏకంగా పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. భారత గగనతలాన్ని శత్రుదేశాలు తరచూ ఉల్లంఘించడం ద్వారా కేంద్రం తలపట్టుకుని కూర్చుంది. 
 
కాగా సెప్టెంబర్ 27వ తేదీన లడఖ్‌లోని ట్రిగ్ హైట్స్ వద్ద చైనా హెలికాప్టర్లు కనిపించాయి. ఏకంగా పదినిమిషాల పాటు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన అనంతరం వెనుదిరిగాయి. ఇప్పుడీ విషయం బయటపడింది. దీనిపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. భారత గగనతలాన్ని శత్రుదేశాలు పదేపదే ఉల్లంఘిస్తున్నా భారత్ ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. 
 
గగనతల అతిక్రమణలకు అడ్డుకట్టవేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా.. కళ్లు తెరిచి కఠిన చర్యలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.