Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గౌరవంగా వెళ్లండి లేదా తన్ని తరిమేస్తాం : భారత్‌కు చైనా వార్నింగ్

బుధవారం, 5 జులై 2017 (14:33 IST)

Widgets Magazine
indo - china border

భారత్ సైన్యానికి చైనా వార్నింగ్ ఇచ్చింది. డోకా లా ప్రాంతం నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే మంచిదని లేనిపక్షంలో తన్ని తరుముతామంటూ హెచ్చరించింది. ఈ మేరకు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' కఠువు వ్యాఖ్యలతో కూడిన సంపాదకీయాన్ని రాసింది.
 
సిక్కిం భూభాగంలోని డోకా లా ప్రాంతంలోకి చైనా హద్దుమీరి వచ్చి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా, ఈ ప్రాంతం భూటాన్‌ దేశ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో గడచిన 19 రోజులుగా డోకా లా ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మోహరించగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొనివుంది. ఇరు దేశాల సైనికులు పరస్పరం తోపులాటకు కూడా దిగారు. 
 
ఈ నేపథ్యంలో... చైనా మరో హెచ్చరిక చేసింది. డోకా లా తమ పరిధిలోనిదేనని చెబుతూ, భారత సైన్యం గౌరవంగా వెనుదిరిగితే బాగుంటుందని, లేకుంటే తాము తన్ని తరిమేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సర్వ సన్నద్ధంగా ఉందని పేర్కొంది. 
 
అదేసమయంలో చైనా భూభాగం నుంచి భారత దళాలను తరిమేసే శక్తి తమకు లేదని ఆ దేశం భావిస్తే, అది వారి అవివేకమని వ్యాఖ్యానించింది. భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేసింది. ఆయన చెప్పిన మాటలు వాస్తవమేనని, 1962 నాటి ఇండియా ఇప్పుడు లేదని చెబుతూనే, తమ దళాలు రంగంలోకి దిగితే, అప్పటి కన్నా పెను నష్టం ఇండియాకు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#Modiiniisrael : మోషేను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోడీ.. ఎవరీ మోషే?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనలో పూర్తి బిజీగా గడుపుతున్నారు. అదేసమయంలో ...

news

ఉద్యోగం ఇప్పిస్తానని రాయ్‌చూర్ తీసుకెళ్లాడు.. బీటెక్ యువతిని వాడేసుకున్నాడు...

ఉద్యోగం పేరుతో బీటెక్ పట్టభద్రురాలు మోసపోయింది. ఆమెకు ఉద్యోగం ఆశచూపి కర్ణాటక రాష్ట్రంలోని ...

news

రిటైర్డ్ ఆర్మీ జవాన్.. విహారయాత్ర పేరుతో కుమార్తెపై అత్యాచారం.. మైనర్‌గా ఉన్నప్పటినుంచే...

అతను పేరుకు మాత్రం రిటైర్డ్ జవాను. రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య చనిపోయింది. దీంతో ఆమెకు ...

news

స్నేహితురాలితో వైద్యుడి కామకేళి... వీడియో తీసిన నర్సు.. తర్వాత ఏం జరిగింది?

తన స్నేహితురాలితో డాక్టర్ జరిపిన కామకేళిని ఓ నర్సు వీడియో తీసింది. విధుల్లో ఏదేనీ తప్పు ...

Widgets Magazine