Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సైనికులు ఆయుధాలు ఉపయోగించని ఆ గడ్డపై పశువులు పచ్చిక మేస్తాయి.. ఇదేం చిత్రం?

హైదరాబాద్, మంగళవారం, 1 ఆగస్టు 2017 (07:57 IST)

Widgets Magazine

భారత్, చైనాల మధ్య సిక్కింలోని డోక్లాంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, డ్రాగన్‌ సైనికులు మన భూభాగంలోకి చొరబడటం ఆగిపోకుండానే.. ఇరుదేశాల సరిహద్దుల్లో మిలటరీ రహిత ప్రాంతానికి సంబందించిన విశేషాలు బయటపడి ఆసక్తి గొలుపుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు(ఐటీబీపీ) ఆయుధాలు లేకుండా మఫ్టీలోనే గస్తీ కాస్తున్నారు. 
 
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. 1958లో ఈ ప్రాంతంలో ఇరుపక్షాలూ తమ బలగాలను మోహరించరాదని ఇరుదేశాలూ నిర్ణయించాయట. 1962 యుద్ధం తర్వాత ఐటీబీటీ జవాన్లు ఆయుధాలు పట్టుకుని అక్కడ తిరిగినా తుపాకులను నేలమీదకు దించే ఉండాలని ఆదేశించారు. 
 
తర్వాత సరిహద్దు వివాద పరిష్కారం కోసం జరిగిన చర్చల్లో భాగంగా జవాన్లు అసలు ఆయుధాలే తీసుకెళ్లకుండా ఉండటానికి భారత్‌ 2000 జూన్‌లో అంగీకరించింది. దీంతో ఇరుదేశాల సైనికులూ ఉన్నప్పటికీ భారత పశువుల కాపర్లూ, టిబెట్ పశువుల కాపర్లూ తమ పశువులను మేపడానికి ఇక్కడి పచ్చికబయళ్లకు తీసుకొస్తుంటారని సమాచారం. 
 
ఇలా ఎక్కడ జరుగుతోందంటారా? పచ్చిక బీడు ప్రాంతమైన 80 చదరపు కిలోమీటర్ల బారాహోతి ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌కు సుమారు 140 కి.మీల దూరంలో ఉంది. ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో కూడిన ‘మిడిల్‌ సెక్టార్‌’లోని మూడు పోస్టుల్లో ఇదీ ఒకటి. భారత్, చైనా సరిహద్దు రేఖ అయిన మెక్‌మోహన్‌ రేఖ బారాహోతి గుండా పోతుంది.


ఈ ప్రాంతాన్ని మిలిటరీ రహిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు(ఐటీబీపీ) ఆయుధాలు లేకుండా మఫ్టీలోనే గస్తీ కాస్తున్నారు. 1958లో భారత్, చైనాలు బారాహోతిని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటిస్తూ ఇరు దేశాల్లో ఎవరూ కూడా తమ బలగాలను అక్కడ మోహరించరాదని నిర్ణయించాయి.
 
అయితే 1962 యుద్ధం తరువాత ఐటీబీపీ జవాన్లు ఆయుధాలు తమ వెంట తీసుకెళ్లడానికి అనుమతించినా, వాటి వాడకంపై కఠిన నిబంధనలు విధించారు. తుపాకులను నేలకు దించే ఉంచాలని సూచించారు. సరిహద్దు వివాద పరిష్కారం కోసం జరిగిన చర్చల్లో భాగంగా జవాన్లు అసలు ఆయుధాలే తీసుకెళ్లకుండా ఉండటానికి భారత్‌ 2000 జూన్‌లో అంగీకరించింది. సరిహద్దు గ్రామాల నుంచి భారత పశువుల కాపర్లు, పొరుగున ఉన్న టిబెట్‌ ప్రజలు తమ పశువులను మేపడానికి బారాహోతి పచ్చిక బయళ్లకు తీసుకొస్తారు.
 
ఇరుదేశాల మధ్య  డోక్లాం ప్రాంతంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బారాహోతి ప్రాంతం పరమ ప్రశాంతంగా ఉండడం సంతోషించదగిన విషయమే కదా.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టార్గెట్ బిహార్ సక్సెస్.. ఇక టార్గెట్ తమిళనాడు మొదలైంది

ఉత్తర భారతదేశంలో ప్రతిపక్షమన్నదే లేకుండా తుత్తునియలు చేసి పడేసిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు ...

news

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. డ్రగ్స్ కథ కంచికి.. అంతా సాక్షులే..

దాదాపు 15 రోజులపాటు చిత్రసీమలోని ప్రముఖులను వణికించి గంటల తరబడి విచారణ తంతు నడిపిన ...

news

అడ్డూ అదుపూ లేకుండా పోతున్న మేల్ పిగ్స్.. మగాడిని మరో మగాడు రేప్ చేసేసాడు

దివంగత ప్రముఖ కవి, జర్నలిస్టు అరుణ్ సాగర్ ఏ సందర్భంలో మగాళ్లను మేల్ పిగ్స్ (మగ పందులు) ...

news

తిరుపతి వేదికగా పవన్ మద్యంపై సమరం...

ఉద్దానం ప్రజల సమస్యలపై తనదైన రీతిలో స్పందించిన జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ ...

Widgets Magazine