శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (16:07 IST)

ఎయిర్ బస్ ఏ320 ప్రమాదం: క్యాబిన్‌లోనే పైలెట్.. కాక్ పిట్ రికార్డర్ షాకింగ్ న్యూస్..!

ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిన ఎయిర్ బస్ ఏ320 పైన విచారణ జరుగుతోంది. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రమాదం జరిగిన సమయంలో కాక్‌పిట్‌లో ఉండవవలసిన పైలట్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. ఈ విషయం కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌ ద్వారా తెలిసింది. విమానం వేగంగా కిందకు పడిపోతుండటంతో ఆ పైలట్ కాక్ పిట్‌లోకి తిరిగి వెళ్లలేకపోయాడని తెలుస్తోంది.
 
బార్సిలోనా నుండి బయలుదేరిన తర్వాత ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ సాగిందని, ఆ పైన ఒక పైలట్ బయటకు వెళ్లాడని, ఆ తర్వాత తిరిగి వచ్చినట్లు బ్లాక్ బాక్స్ ద్వారా దొరికిన కాక్ పిట్‌లో రికార్డ్ అవలేదని, దీంతో అతను రాలేదని అర్థమవుతోందని చెబుతున్నారు.
 
బయట ఉన్న పైలట్ కాక్ పిట్ తలుపును తొలుత మెల్లిగా, ఆ తర్వాత గట్టిగా కొడుతున్న శబ్దాలు వినిపించాయని విచారణాధికారులు చెప్పారు. డోర్ తీసే సమయం కూడా లేకుండా పోయిందన్నారు. ప్రమాదం తర్వాత నో చెబుతున్న పైలట్లు జర్మన్ వింగ్స్ కొన్ని విమానాల ప్రయాణాన్ని రద్దు చేసే అవకాశముంది. 
 
ఎయిర్ బస్ ఏ320 ప్రమాదం నేపథ్యంలో జర్మన్ వింగ్స్‌కు చెందిన పలువురు పైలట్లు, క్రూ మెంబర్స్ విమానయానానికి నో చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూ మెంబర్స్ ప్రయాణానికి సిద్ధంగా లేరని అధికారులు చెబుతున్నారు. అయితే, ఎందరు నిరాకరిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.