శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (10:23 IST)

కొలంబియాలో కూలిన విమానం 12 మృతి

సాంకేతిక సమస్య తలెత్తడంతో కొలంబియా మిలిటరీకి చెందిన ఓ విమానం శుక్రవారం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 12మంది మృతి చెందారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మాత్రమే ప్రమాదం జరిగిందని కొలంబియా అధ్యక్షుడు జాన్‌ మాన్యూల్‌ ప్రకటించారు. ఇందులో ఎటువంటి వేరే కారణాలు లేవని చెప్పారు.  
 
బొగోటా ప్రాంతానికి 800కిలోమీటర్ల దూరంలో లాస్‌పాలోమాస్‌ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని వెల్లడించారు. విమానంలో ఉన్న 12మంది మృతిచెందారని ఆయన ధ్రువీకరించారు. మృతుల కటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు జాన్‌మాన్యూల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.