ప్రపంచంలోనే తొలి శృంగార పార్కు... ఎక్కడ?

సాధారణంగా వినోదానికి, సాయంత్రం వేళల్లో సేదదీరేందుకు, ఉదయం వేళలో వాకింగ్ చేసేందుకు పార్కులు ఉంటాయి. కానీ, శృంగారం కోసం తొలిసారి ఓ పార్కును నెలకొల్పారు. అదీకూడా బ్రెజిల్ దేశంలో. ఈ శృంగార థీమ్ పార్కు చూప

erotikaland park
pnr| Last Updated: మంగళవారం, 26 జూన్ 2018 (14:00 IST)
సాధారణంగా వినోదానికి, సాయంత్రం వేళల్లో సేదదీరేందుకు, ఉదయం వేళలో వాకింగ్ చేసేందుకు పార్కులు ఉంటాయి. కానీ, శృంగారం కోసం తొలిసారి ఓ పార్కును నెలకొల్పారు. అదీకూడా బ్రెజిల్ దేశంలో. ఈ శృంగార థీమ్ పార్కు చూపరులను మతిపోగొడుతోంది. ఇందులో ఏర్పాటు చేసిన వివిధ రకాల శృంగార భంగిమలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఈ పార్కులోకి అడుగుపెట్టగానే ప్రతి ఒక్కరూ శృంగార లోకంలో విహరిస్తున్న అనుభూతికి లోనయ్యేలా చేస్తోంది.
 
అయితే, ఈ పార్కు నిర్మాణ దశలో ఎన్నో వివాదాలు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు ప్రజల సందర్శనార్థం సిద్ధమైంది. బ్రెజిల్‌లోని సావో పాలో ప్రాంతంలో ఏర్పాటైన ఈ శృంగార వినోద కేంద్రానికి 18 యేళ్లు నిండినవారినే అనుమతిస్తారు. 'ఎరోటికాల్యాండ్'గా పిలుస్తున్న సెక్స్‌ థీమ్‌ పార్కులో.. శృంగార శిల్పాలు, రొమాన్స్ షాపు, న్యూడ్‌‌పూల్‌, రెచ్చగొట్టే ఆటలు, వైబ్రేటింగ్‌ సీట్లతో కూడిన సినిమా హాలు, హోటల్‌ ఉన్నాయి. 
 
ఈ పార్కును సుమారుగా 22.4 మిలియన్‌ డాలర్లతో నిర్మించారు. అందమైన ప్రకృతి, సాహస క్రీడలు, వాటర్‌ రైడ్స్‌ ఇలా ప్రపంచంలో అనేక థీమ్‌ పార్కులు ఉన్నాయి. అయితే కేవలం పెద్దల కోసం రూపొందించిన పార్కు ప్రపంచంలో ఇదొక్కటే అంటున్నారు నిర్వాహకులు. అయితే ఇక్కడ శృంగారం చేయడానికి మాత్రం వీల్లేదు సుమా. దీనిపై మరింత చదవండి :