శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (17:19 IST)

ఇటలీలో కరోనా దెయ్యం.. రాత్రుల్లో తిరుగుతుందట.. ఎలా వుంటుందంటే?

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా చాలా చోట్ల ప్రజలు ఏదో ఒక సాకుతో బయటకు వస్తున్నారు. ఇక చాలా దేశాల్లో ప్రజలను బయటకు రాకుండా భయపెట్టేపని మొదలు పెట్టారు.
 
కరోనాతో ఇప్పటివరకు ఇండోనేషియాలో 373 మంది మరణించారు. 4241 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఇండోనేషియాలోని మారుమూల గ్రామాల్లో కరోనా గురించి అవగాహన లేనివారు నేటికీ వీధుల్లో సంచరిస్తున్నారు. ఇక వారికి ఎంత చెప్పినా వైరస్‌పై అవగాహన రావట్లేదు. అంతేకాదు వైరస్‌ గురించి హెచ్చరించినా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోని కెపూ గ్రామానికి చెందిన యువకులు ప్రజలను భయపెట్టే పనిలో పడ్డారు. దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి వినూత్న ప్రయోగానికి తెరతీశారు.
 
దెయ్యం బూచిని చూపించి ప్రజలను ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారు. ఈ మేరకు వారే పొకాంగ్‌‌లను అర్ధ రాత్రులు వీధుల్లో తిప్పుతున్నారు. పొకాంగ్ అంటే తెల్లటి బట్టలో చుట్టబడిన మృతదేహం అని అర్ధం.. ఇక దీనినే అక్కడ దెయ్యంగా వ్యవహరిస్తారు.

ఇక కొందరు యువకులు దెయ్యాల అవతారమెత్తి అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బతిమాలి చెప్పితే వినని వారిని భయంతో దారికి తెస్తున్నారు. ఇందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు.